Renu Desai: దయచేసి సహాయం చేయండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నానంటూ రేణు దేశాయ్ పోస్ట్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Update: 2024-09-20 12:42 GMT

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పోస్టులు పెడుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ నుంచి పలు విషయాలపై రియాక్ట్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. అలాగే మెగా ఫ్యాన్స్ ఏదైనా అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తాజాగా, రేణు దేశాయ్ సాయం చేయండని రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రేణు దేశాయ్‌ను సాయం కోరాడు. ‘‘మేడం మేము సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాం. గవర్నమెంట్ వాళ్ళు మా గ్రామానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. 70 ఏళ్లుగా మేము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్లకి మేము వాటర్ బిల్‌తో పాటు ఇంటి బిల్లు కూడా కడుతున్నాం., ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా తీసుకున్నాము.

ఇలాంటి సమయంలో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను ఒకేసారి ఖాళీ చేయమని చెప్తున్నారు. మీరైనా మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సాయం చేయండి’’ అని పోస్ట్ చేశాడు. ఇక అది చూసిన రేణు దేశాయ్ ‘‘ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు నేను హెల్ప్ లెస్‌గా ఫీల్ అవుతున్నాను. నాకు వాళ్లకి సాయం చేయాలని నిజంగానే ఉంది. కానీ నేను గవర్నమెంట్ ద్వారా ఎన్నికైన వ్యక్తిని కాదు కాబట్టి చేయలేకపోతున్నాను. ఎవరైతే వాళ్లకు హెల్ప్ చేయగలరో దయచేసి చేయండి’’ అని రాసుకొచ్చింది. ఈ చాట్ అంతా వీడియో చేసి ఇన్‌స్టాలో పెట్టింది.

 


Similar News