Sobhita Dhulipala: అంతర్జాతీయ అవార్డుల బరిలో అక్కినేని కోడలు బోల్డ్ సిరీస్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’.

Update: 2024-09-20 12:09 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’. 2016లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో మేకర్స్ రెండో సీజన్‌ను కూడా తెరకెక్కించారు. అది మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది. తాజాగా, ది నైట్ మేనేజర్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో భారత్ నుంచి కేవలం ఈ సిరీస్ మాత్రమే పోటీలో నిలవడం విశేషం.

అయితే ఈ విషయాన్ని శోభిత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘ఉత్తమ డ్రామా సిరీస్‌కి అంతర్జాతీయ ఎమ్మీ నామినీని పొందిన ఏకైక భారతీయ సిరీస్ ది నైట్ మేనేజర్’’ అని రాసుకొచ్చింది. కాగా, ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ ఫొటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక శోభిత అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్తుండటంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. ఇక గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం శోభిత పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలో.. ఆమె నటించిన సిరీస్ అంతర్జాతీయ అవార్డుల వేడుకకు ఎంపిక అవడం గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Similar News