డిజిటల్‌ రైట్స్‌లో అరుదైన రికార్డ్‌ సాధించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’..

విశ్వసనీయ నటుడు కమల్ హాసన్ తాజా ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’.

Update: 2024-09-20 14:12 GMT

దిశ, సినిమా: విశ్వసనీయ నటుడు కమల్ హాసన్ తాజా ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’. KH234గా తెరకెక్కతున్న ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యలక్ష్మి, త్రిష హీరోయిన్లుగా నటిస్తుండగా.. కోలీవుడ్ యాక్టర్ శింబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా మరో పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘థగ్‌ లైఫ్‌’.. డిజిటల్ డీలింగ్స్ కూడా పూర్తైయినట్లు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ మొత్తం కోలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ ‘Kollywood Now’ అనే X అకౌంట్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘#ThugLife కోలీవుడ్ చరిత్రలో అతిపెద్ద డిజిటల్ డీల్‌తో కొత్త రికార్డును సృష్టించింది. భారీగా ₹149.7 కోట్లకు విక్రయించబడింది!. ఈరోజు షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం 2025 వేసవిలో ఎపిక్ విడుదలకు సిద్ధంగా ఉంది!’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.


Similar News