Johnny Master Case: కావాలని ఇరికించే ప్రయత్నాలు.. జానీకి మద్దతుగా మరో డాన్స్ మాస్టర్

జానీ మాస్టర్ తప్పు చేసి ఉండకపోవచ్చని, కావాలని ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డాన్స్ మాస్టర్ రాము సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-20 08:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జానీ మాస్టర్ తప్పు చేసి ఉండకపోవచ్చని, కావాలని ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డాన్స్ మాస్టర్ రాము సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు మరో డాన్స్ మాస్టర్ రాము మద్దతుగా నిలిచారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎవరికి ఏ సమస్య వచ్చిన వారిని ఆదుకున్నాడని, ఎవరో ఒకరు ఆయన వెంట ఉండకపోవచ్చు. కానీ కొరియోగ్రాఫర్లు చాలా మంది ఆయన వెంటే ఉన్నారని, కాకపోతే బయటకి వచ్చి మాట్లాడరని తెలిపారు.

గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెబుతున్నారని, అప్పటి నుంచి బయటకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బాదితురాలిని బెదిరించారు అనేది నిజం కాదని, కొరియోగ్రాఫర్ అనేది జాబ్ కాదని, ఒక సాంగ్ డ్యాన్స్ రిహార్సల్స్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటుందని, తర్వాత వేరే కొరియోగ్రాఫర్ దగ్గరకి వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. జానీ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని, కావాలని ఆయనని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అంతేగాక నిజనిజాలు బయటికి వస్తాయని, అప్పుడు న్యాయం పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. అలాగే మా అసోసియేషన్ లో సభ్యత్వాలు నిరాకరించారు అనేది అసత్యమని డాన్స్ మాస్టర్ రాము చెప్పారు.    


Similar News