సెంట్రల్ ధార్మిక పరిషత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నా : చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్

తిరుపతి లడ్దూ ప్రసాదంలో నాణ్యత వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు.

Update: 2024-09-20 08:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి లడ్దూ ప్రసాదంలో నాణ్యత వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు. ఈ వివాదం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందన్నారు. వెంకన్న ప్రసాదంపై విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు. నాణ్యమైన ఆవు నెయ్యి, ప్రసాద తయారీ పదార్ధాలకు మార్కెట్ ల ధరలతో పోల్చితే టీటీడీ తక్కువ టెండర్ ఖరారు చేయడం లడ్డూ నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  నేషనల్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు లేక సెంట్రల్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు. ఈ తరహా వివాదాలకు తావు లేకుండా, సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు దేవాలయాల నిర్వాహణను ప్రభుత్వాల పరిధి నుంచి తప్పించి మఠాధిపతులు, పీఠాధిపతులు, రిటైర్డు జడ్జిలతో కూడిన సెంట్రల్ ధార్మిక పరిషత్ ఆధీనంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. 


Similar News