Viral: కర్కశత్వంలో కూడా కారుణ్యం.. దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ది
దొంగకు పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి చేసిన విచిత్ర ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దొంగకు పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి చేసిన విచిత్ర ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. తమ సంపదను దోచుకోవడానికి వచ్చిన దొంగపై కూడా యువకులు మానవత్వం చూపించారు. కర్కశత్వంలో కూడా కారుణ్యం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఘటన ప్రకారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో పోగల గణేష్ అనే వ్యక్తి కొంత కాలంగా దొంగతనాలను పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో తన చేతివాటం ప్రదర్శించేందుకు వచ్చాడు. గుళ్లో హుండి దొంగతనం చేస్తుండగా.. స్థానిక యువకులు పట్టుకున్నారు. దొంగను కరెంట్ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేస్తుండగా.. దొంగ ఆకలి వేస్తుందని చెప్పాడు. దీంతో దొంగకు పులిహోర తినిపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం అతన్ని వివరాలు అడిగి తెలుసుకొని మరో సారి దేహశుద్ది చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించి దొంగను వారికి అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు.