Breaking News: పోలీసులపై గిరిజనుల దాడి.. వీడియో వైరల్
ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దిశ వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షకు దిగిన రెండు గిరిజన వర్గాలను అడ్డుకునేందుకు పోలీసు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గిరిజనలు పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. చంద్రయాపాలెం అటవీ ప్రాంతానికి చెందిన రెండు గిరిజన తెగల మధ్య పోడు భూముల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా చినుకు చినుకు కలిసి గాలివానగా మారినట్టు ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. అయితే విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘర్షణను నియంత్రించేందుకు పోలీసులు కొట్టుకుంటున్న ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాలు వాళ్ళను అడ్డుకోవాలని చూసిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
కర్రలు, రాళ్లతో పోలీసులను కొట్టారు. గిరిజనుల దాడి నుండి తప్పించుకునేందుకు పోలీసు పరుగులు పెట్టారు. అయినా గిరిజనులు శాంతించలేదు పోలీసులను తరిమితరిమి కొట్టారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు కాగా.. సత్తుపల్లి ఎస్సై కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ మీరు ఒకసారి చూసేయండి.
పోలీసులపై దాడి చేసిన గిరిజనులు ఖమ్మం - సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులుపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. pic.twitter.com/EYE9ccGHi9
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2024