పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఓటు వేసినా వేస్టే: కిషన్ రెడ్డి

కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-01-29 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ కార్యాలయంలో బీజేపీ బస్సు యాత్రల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీకి ఓటేయాలని ఇప్పటికే 30 శాతం మంది ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచిందని గుర్తుచేశారు. ఈ సారి ఆ సంఖ్య రెండు రెట్లు పెరిగి.. డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోబోతున్నామని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ గెలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తెలంగాణలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేసి లాభం లేదన్న విషయం తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిందని అన్నారు. అమలు చేయాలని ప్రశ్నిస్తే వారివద్ద సమాధానం లేదని.. దాటవేసే ధోరణి కనిపిస్తోందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త జిమ్మిక్కులు చేస్తారని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై గతంలో విచారణ చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎమ్ఐఎమ్ రాయభారం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News