కేసీఆర్ నయా వంచకుడు.. సకల జనుల ద్రోహి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నయవంచకుడని, చిత్తశుద్ధిలేని హామీలు ఇవ్వడంలో దిట్ట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2023-10-15 13:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నయవంచకుడని, చిత్తశుద్ధిలేని హామీలు ఇవ్వడంలో దిట్ట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం మరొకసారి ప్రజలను వంచించేందకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2014, 2018, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఫైరయ్యారు. సీఎం కేసీఆర్‌ది.. బెస్ట్ పాలసీ కాదని, వరెస్ట్ ఎకనామికల్ పాలసీ అని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదని, బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ అని, బెస్ట్ ఇరిగేషన్ కాదని, బెస్ట్ ఇరిగేషన్ కమీషన్ పాలసీ అని ధ్వజమెత్తారు. యాంటీ దళిత ఇంప్లిమెంట్ పాలసీ అని ఫైరయ్యారు. ఫ్యామిలీ, కమీషన్, చీటింగ్ పాలసీలను మాత్రం బెస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం సకల జనుల ద్రోహి అని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ సైతం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్.. ప్రజలను వంచించడానికే మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ అనేక హామీలిచ్చారని, అందులో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. కేంద్రం వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఇంతవరకు భూమి కేటాయించని అసమర్థ ప్రభుత్వమని ఫైరయ్యారు. సెకండ్ ఫేస్ మెట్రో ఎందుకు ఆగిపోయిందో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణలో మరొక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

గులాబీ పువ్వులతో గ్రాఫిక్స్ చూపించి జీహీచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని, 84 వేల పుస్తకాలు చదివిన తెలివితో సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూలో 80 శాతం ఆయన చేసిన అప్పుల వడ్డీలకే పోతోందని తెలిపారు. నిరుద్యోగులకు ఇంతవరకు భృతి ఇచ్చేందుకు దిక్కులేదని, అలాంటిది 90 లక్షల మందికి రూ.3000 ఇస్తానంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News