మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీతో కలవం: తేల్చిచెప్పిన కిషన్ రెడ్డి
దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి తర్వాత విస్తృత ప్రచారం చేస్తామని, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి, రాజ్‌నాథ్ సింగ్, హిమాంత బిశ్వశర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తారని స్పష్టంచేశారు. మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు. మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని అబద్ధపు ప్రచారాలు చెబుతున్నారని, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లీస్ తో కలవబోమని స్పష్టంచేశారు. వాళ్ళతో లాభపడింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.