Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ‘జీరో’ నిధులు.. KTR ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్

నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

Update: 2024-07-23 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రవేశపెట్టనుంది. ప్రధాని మోడీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తి స్థాయి పద్దును సమర్పించనుంది. కాగా, యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు నిధులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. యూనియన్ బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపుల అంశమై ఉదయాన్నే ఓ జర్నలిస్టు తనను అడిగాడని.. తాను బదులిస్తూ.. గత పదేళ్లుగా తెలంగాణకు కేంద్రం ఇస్తున్న ‘బిగ్ జీరో’ ఈ సారి బడ్జెట్‌లో కేటాయిస్తారని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు రియాక్ట్ అయి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన సీట్లకు సమానం అన్న మాట అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరెందుకు మీరు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ కడిగిపడేస్తున్నారు. పదేళ్లలో కేంద్రం నుంచి మీరు సాధించింది జీరో అని ఒప్పుకున్నట్లేనా అంటూ ఫైర్ అవుతున్నారు. మరేందుకు మీరు గత పదేళ్లలో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చారంటూ కడిగి పాడేస్తున్నారు.  

Tags:    

Similar News