హవాలా లావాదేవాల్లో ఇద్దరు TRS ఎమ్మెల్యేలు: విశ్వహిందూ పరిషత్

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో శిక్షణ పొందిన 500 మంది ఉగ్రవాదుల ఆచూకీ లేదని, ఈ విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశ్వహిందు

Update: 2022-09-19 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో శిక్షణ పొందిన 500 మంది ఉగ్రవాదుల ఆచూకీ లేదని, ఈ విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా భద్రతను విస్మరించిందని, ఉగ్రవాదులకు, అరచకత్వానికి బాటలు వేస్తోందని ఆరోపణలు చేశారు. గతంలో ఉగ్రవాదులకు అడ్డాగా భాగ్యనగర్ ఉండేదని, కానీ ఇప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా ఉగ్రవాదుల స్థావరంగా మారిపోయిందని ఫైరయ్యారు. వారికి పోలీసులే ఆశ్రయయం కల్పిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం విఫలమైందని విమర్శలు చేశారు. తాము దీనిపై మూడు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థ దాదాపు 15 విభాగాలుగా విడిపోయి, ఎవరికీ అనుమానం రాకుండా హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందని వారు ఆరోపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఒక్క తెలంగాణలోనే 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శలు చేశారు. దీన్ని కూడా రాజకీయం చేస్తూ దర్యాప్తు సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని, సోదాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని, ఉగ్రవాద మూలాలున్న వ్యక్తులను వదిలేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న హవాలా డబ్బు లావాదేవీల్లో టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కేంద్రంగా దశాబ్దాలుగా సాగుతున్న పీఎఫ్ఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చడమే కాకుండా శిక్షణ పొందిన ఉగ్రవాదులను పట్టుకుని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం మెప్పు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News