చెరువులో ఎస్ఐ, కానిస్టేబుల్ సహా ముగ్గురి మృతదేహాలు.. మిస్టరీ డెత్స్‌పై ఎస్పీ సింధు శర్మ ప్రకటన

కామారెడ్డి జిల్లాల్లో ఒక ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతదేహాలు అడ్లూరు చెరువులో లభ్యం అయ్యాయి.

Update: 2024-12-26 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లాల్లో ఒక ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతదేహాలు అడ్లూరు చెరువులో లభ్యం అయ్యాయి. నిన్న రాత్రి ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా.. ఈ రోజు తెల్లవారుజామున ఎస్ఐ సాయికుమార్(SI Saikumar) మృతదేహాన్ని కూడా పోలీసులు రాత్రి మొత్తం వేతికి బయటకు తీశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిన మిస్టరీ డెత్స్ (Mystery Deaths)పై జిల్లా ఎస్పీ సింధు శర్మ(SP Sindhu Sharma) స్పందించారు. మొదట చెరువు కట్టపై ఎస్‌ఐ మృతదేహాన్ని(Dead body of SI) పరిశీలించిన ఆమె పోస్టుమార్టం నిమిత్తం ఆ డెడ్ బాడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. అడ్లూరు చెరువులో శృతి(కానిస్టేబుల్) నిఖిల్(కంప్యూటర్ ఆపరేటర్) సాయి కుమార్(బిక్కనూర్ ఎస్ఐ) ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం. ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్‌ గుర్తించాము. పోస్టుమార్టం(Postmortem) నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేము. ముగ్గురి మరణంపై విచారణ కొనసాగుతోంది. కేసులో పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ చెప్పుకొచ్చారు. అయితే వివాహేతర సంబంధమే ఈ ఆత్మహత్యలకు కారణం అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Similar News