టీఎస్పీఎస్సీ సైట్‌ను వెంటనే నిలిపివేయాలి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ సైట్‌ను వెంటనే నిలిపివేయాలని, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు సర్వర్లు సీజ్ చేసి పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్లీడర్బక్క జడ్సన్ పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ పై సమగ్ర విచారణ జరగాలంటే సిట్‌తో సాధ్యం కాదని, వెంటనే సీబీఐకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని జడ్సన్ గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. డాక్టర్బి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కమిషన్ అధికార రాష్ట్ర పార్టీకి వత్తాసు పలుకుతూ.. ముందుకు సాగుతుందన్నారు.
దీంతో టీఎస్పీఎస్సీ ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి, కుంభకోణం దోషులు తేలే వరకు టీఎస్పీఎస్సీ ని దర్యాప్తు సంస్థలు కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గవర్నర్లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ప్రభుత్వంలో అంతా అవినీతి మయం అయిందన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, పేదలను పొట్ట కొట్టే పనులన్నీంటిని బీఆర్ఎస్ సర్కార్చేస్తోందని ఆరోపించారు.