విషాదం.. ప్రేమ విఫలమై సెక్యూరిటీ గార్డ్ సూసైడ్
ప్రేమ విఫలమై.. సెక్యూరిటీ గార్డ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి రసాయనిక ఫ్యాక్టరీలో జరిగింది.
దిశ, భిక్కనూరు: ప్రేమ విఫలమై.. సెక్యూరిటీ గార్డ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి రసాయనిక ఫ్యాక్టరీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భిక్కనూరు పట్టణ శివారులో ఉన్న ఎమ్‌ఎస్‌ఎన్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సూరజ్ కుమార్(20) రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటి స్నేహితులు, చుట్టుపక్కల వారు చెబుతున్న వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా లవ్ ఎఫైర్ పెట్టుకున్న సూరజ్ ప్రేమ విఫలమయ్యే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. డ్యూటీలో ఉన్న సూరజ్ కుమార్ బీహార్ లో ఉన్న తన ప్రేయసితో మాట్లాడుతూ వాట్సాప్‌లో ఫోటోలు అప్లోడ్ చేసిన, అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
తీవ్ర మనస్థాపానికి గురైన సూరజ్ కుమార్ గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.