హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది.

Update: 2024-10-11 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. దసరా పండుగ సందర్భంగా నగరవాసులంతా పల్లెబాట పట్టడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. టౌటుప్పల్ మండలం కేంద్రం నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచనలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ డీజిల్ ట్యాంకర్ పేలింది. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.


Similar News