Diamond Bathukamma: 101 వజ్రాలు, బంగారంతో బతుకమ్మ
అతి చిన్న బతుకమ్మ. అది కూడా వజ్రాలతో దగదగా మెరిసిపోతున్నది. బంగారంతో నిండింది. అందుకే అంత స్పెషల్.
దిశ, తెలంగాణ బ్యూరో: అతి చిన్న బతుకమ్మ. అది కూడా వజ్రాలతో దగదగా మెరిసిపోతున్నది. బంగారంతో నిండింది. అందుకే అంత స్పెషల్. హైదరాబాద్ కర్మన్ ఘాట్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు ముంజంపల్లి రఘు దీన్ని రూపొందించారు. కేవలం 2.1 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. ఇందులో 1.2 క్యారట్ డైమండ్స్‌ని వాడారు. వాటి ఎత్తు 10 మి.మీ., వెడల్పు 7 మి.మీ. మాత్రమే. 101 వజ్రాలను అందులో పొదిగించారు. దాంతో చూపరులను భలే ఆకట్టుకుంటున్నది. దీన్ని కేవలం నాలుగు గంటల్లోనే తయారు చేయడం విశేషం. గతంలోనూ పలు సూక్ష్మకళాఖండాలను తయారు చేసిన అనుభవం రఘుది. ఈ ఏడాది బతుకమ్మను తనదైన శైలితో రూపొందించి కళాకారుల మెప్పు పొందారు.