Hydraa Bathukamma : క‌న్నీళ్లు పెట్టిన‌ హైడ్రా బతుకమ్మ..! ఫోటోలు వైరల్

తెలంగాణలో ఊరు వాడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2024-10-11 13:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఊరు వాడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో, ఆడబిడ్డల ఆటపాటలతో బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నగరంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలను ఉద్దేశించి బతుకమ్మను తయారు చేశారు.

హైడ్రా పేరిట ప్రభుత్వం చేస్తున్న పేదల ఇండ్ల కూల్చివేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా.. దంపతులు బతుకమ్మను పేర్చినట్లు వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు ‘హైడ్రా బతుకమ్మ’ను తీర్చిదిద్దారు. తాజాగా హైడ్రా బతుకమ్మ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. క‌న్నీళ్లు పెట్టిన‌ హైడ్రా బతుకమ్మ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News