Minister Komatireddy: చరిత్రలో నిలిచిపోతుందనే నమ్మకముంది

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యారంగంలో ఒక విప్లవం సాధిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-10-11 14:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యారంగంలో ఒక విప్లవం సాధిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ దసరా నిరుపేదల విద్యకు అండగా నిలిచే ఆసరాగా చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దశాబ్ధకాలంగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ విద్యారంగానికి నూతన జవసత్వాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ‘‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’’ ద్వారా తెలంగాణ విద్యారంగంలో ఒక విప్లవానికి నాంది పలికిందన్నారు. కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని అన్నారు. స్థానిక జిల్లాలోని గంధంవారి గూడెం వద్ద రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ పాఠశాల పైలాన్ ఆవిష్కరించి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు. ఈ పాఠశాలల్లో చదువుతోపాటు, అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు. 5000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.


Similar News