నవంబర్ 4 నుండి స్కిల్ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ(Skill University)లో వచ్చేనెల నుండి కోర్సులు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-10-11 15:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ(Skill University)లో వచ్చేనెల నుండి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు స్కిల్ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్ లో క్లాసులు నిర్వహించబడతాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీ.ఎల్.వీ.ఎస్.ఎస్ సుబ్బారావు తెలిపారు. నవంబర్ 4 నుండి మొదలవబోతున్న కోర్సులు లాజిస్టిక్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాలలో తరగతులు ఉండబోతున్నాయి. త్వరలోనే మరిన్ని కోర్సులు ప్రారంభిస్తామని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. కాగా ఈ తరగతులకు సంబంధించిన లాబ్స్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7 విడుదల చేసింది. 


Similar News