Ram Charan: మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన రామ్ చరణ్

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి..

Update: 2024-10-11 16:47 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో శుక్రవారం సద్దుల బతుకమ్మ నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ, వ్యాపార, ప్రముఖులు, సినీ నటులు సైతం పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Mega Power Star Ram Charan Tej) బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి రామ్ చరణ్ బతుకమ్మ ఆడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News