Tiger Attack: మరోసారి పెద్దపులి దాడి.. రైతుకు తీవ్రగాయాలు

ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి (Tiger Attack) చేసింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై పెద్దపులి దాడి చేయగా.. రైతు సురేష్ (Farmer Suresh) తీవ్రంగా గాయపడ్డాడు.

Update: 2024-11-30 07:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి (Tiger Attack) చేసింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై పెద్దపులి దాడి చేయగా.. రైతు సురేష్ (Farmer Suresh) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 15 గ్రామాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించారు అధికారులు. నిన్న పులి దాడిలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి మరణించింది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు (Forest Officers) పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బోనులు, పులి కదలికలను గమనించేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారు పొలం పనులకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News