ఇగో ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు!
ఇగో ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇగో ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. బీఆర్‌ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన నీటితో నిరుడు మార్చి నెలలో దిగువ మానేరు జలాశయం కళకళలాడిందని, ఇతర జిల్లాలకు తాగు, సాగు నీరందించిందని పేర్కొంది. జూన్ నెల వరకు కూడా రిజర్వాయర్‌లో నీరు నిలువ ఉన్నదని, యాసంగి వరిసాగుకు ఆయకట్టు భూములకు పూర్తి స్థాయిలో సాగునీరందించిందని తెలిపింది.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టును సక్రమంగా వినియోగించక పోవడంతో మధ్యలోనే రిజర్వాయర్ ఖాళీ అయిందని ఆరోపించింది. మరికొద్దిరోజుల్లో డెడ్‌స్టోరేజీకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందే అవకాశాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే నాడు మార్చి 2023, నేడు మార్చి 2024 రిజర్వాయర్ ఫోటోను బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది.