ఇంక్రిడిబుల్ ఇండియా ఇదే..ఎంపీ అర్వింద్ ఆసక్తికర ట్వీట్ (వీడియో)
ఇండియన్ రైళ్లను ఆధునీకరించడంలో భాగంగా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైళ్లను ఆధునీకరించడంలో భాగంగా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 800 కి.మీ దూరాన్ని కేవలం 10 గంటల్లో చేరుకునేలా ఈ ట్రైన్‌ను రూపొందించారు. 2019 ఫిబ్రవరి 15న ఈ ట్రైన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం 51 రైలు మార్గాల్లో వందేభారత్ సేవలు అందిస్తోంది. కాగా, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని చుట్టూ పచ్చదనం నిండిఉన్న ఘాట్ల మధ్య నడుస్తున్న ఓ వీడియోను ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇంక్రిడిబుల్ ఇండియా అంటూ కామెంట్ చేసి వికసిత్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జత చేశారు. షారుక్ ఖాన్, మనీషా కోయిరాలా నటించిన ‘దిల్ సే’ మూవీలోని ఛల్ ఛయ్యా పాట మ్యూజిక్‌తో ఎడిట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.