కరీంనగర్ మెడికల్ కాలేజీపై సస్పెన్స్..!
కరీంనగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్‌పై సస్పెన్స్ నెలకొన్నది. నేషనల్ మెడికల్ కమిషన్ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్‌పై సస్పెన్స్ నెలకొన్నది. నేషనల్ మెడికల్ కమిషన్ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్‌తో పాటు అన్ని సౌలత్లు కల్పించినా.. ఇప్పటి వరకు ఎన్ఎంసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.దీంతో ఆఫీసర్లు కూడా డైలమాలో ఉన్నారు.ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు నేషనల్ మెడికల్ కమిషన్‌కు పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ కాలేజీ పర్మిషన్ఇవ్వకపోవడం గమనార్హం. త్వరలో ఇస్తామంటూ ఎన్ఎంసీ దాట వేస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు ఫైర్అవుతున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల ప్రెజర్‌తోనే కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు స్వయంగా వైద్యశాఖలోనే చర్చ జరుగుతున్నది.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పలుకుబడిని ఉపయోగించి కరీంనగర్ లో సర్కారీ వైద్య కళాశాల రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
8 కాలేజీలకు ఇచ్చి..?
జిల్లాకో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా 2023–24 అకాడమిక్ ఇయర్లో జనగామ, జయశంకర్భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్లా, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రభుత్వం కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తుంది. మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్రం మొండి చేయి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్‌ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తోన్నది. అయితే అందుకోసం ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీలకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు, ఇతర సౌలత్లన్నీ రూల్స్ ప్రకారం ఉంటే వెంటనే ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వాలి. కానీ కరీంనగర్ మెడికల్ కాలేజీలపై ఇప్పటికీ సస్పెన్స్వీడలేదు. జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీం ఆసీఫాబాద్, సిరిసిల్లా, వికారాబాద్, నిర్మల్జిల్లాలకు అనుమతులు వచ్చినా..ఒక్క కరీంనగర్‌కే ఎందుకు ? ఆపారో తమకూ అర్థం కావడం లేదని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ కాలేజీ కు అన్నీ ఈజీ..
నేషనల్మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) రూల్స్ ప్రకారం కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభించాలంటే కనీసం 480 పడకల ఆసుపత్రి అనుబంధంగా ఉండాలి. ఈ 9 కాలేజీల్లో కరీంనగర్ లో తప్పా ..మొదట మరేక్కడా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఆసుపత్రుల్లో బెడ్లు లేవు. దీంతో అన్నింటిలో నిబంధనల ప్రకారం బెడ్లను పెంచుతూ వచ్చారు. జనగామ మెడికల్కాలేజీకు జిల్లా ఆసుపత్రిని అనుసంధానం చేయగా, మథర్అండ్ చైల్డ్ కేర్ యూనిట్లో ఉన్న 100 పడకలు కలిపితే కేవలం 200 బెడ్లకు మాత్రమే పెరుగుతుంది.అంటే మరో 230 బెడ్లు ఈ మెడికల్‌కాలేజీకి అటాచ్‌చేశారు. అదే విధంగా జయశంకర్భూపాలపల్లిలోని జిల్లా ఆసుపత్రిలో పాత, అప్గ్రేట్ చేస్తున్న బెడ్లతో 390 ఉండగా, మరో 40 బెడ్లు ను ఏర్పాటు చేశారు.కామారెడ్డి లో డీహెచ్వింగ్ఆసుపత్రి , ఎంసీహెచ్ హాస్పిటల్ కలిపితే 150 బెడ్లు ఉండగా, మరో 280 బెడ్లు ఎటాచ్చేశారు.
ఖమ్మంలో డిస్ట్రిక్ట్, ఎంసీహెచ్ లు కలిపి 400 బెడ్లు ఉండగా, మరో 30 బెడ్లు అదనంగా సమకూర్చారు. ఇక కొమరం భీం ఆసీఫాబాద్‌లో 385 బెడ్లతో టీవీవీపీ ఆసుపత్రి ఉండగా, మరో 45 బెడ్లు ,. రాజన్న సిరిసిల్లా జిల్లాలో 400 బెడ్లు ఉండగా మరో 30 బెడ్లు,. వికారాబాద్‌లో 150 బెడ్లు ఉండగా, మరో 280 బెడ్లను అదనంగా సమకూర్చుకున్నారు. నిర్మల్ లోనూ ఇదే తరహాలో బెడ్లను పెంచారు. ఎలాంటి అటాచ్మెంట్లు లేకుండా కరీంనగర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే సౌకర్యం ఉన్నా..ఎన్ఎంసీ ఇప్పటి వరకు పర్మిషన్ఇవ్వకపోవడం గమనార్హం. రెండు ప్రైవేట్ కాలేజీల ఒత్తిడితోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.