సుప్రీంలో గ్రూప్-1 వాయిదాపై విచారణ ప్రారంభం.. సర్వత్రా ఉత్కంఠ

గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం పాస్ ఓవర్ చేసింది.

Update: 2024-10-21 07:23 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్ -1 పరీక్ష (Group-1 Mains)ను వాయిదా వేయాలని కోరుతూ.. అభ్యర్థులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తో పాటు గ్రూప్ -1 అభ్యర్థులు, టీజీపీఎస్సీ చైర్మన్ ఈ విచారణలో పిటిషనర్ తరఫున లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేసును పాస్ ఓవర్ చేసింది. మిగతా కేసుల్ని విచారించిన తర్వాత.. గ్రూప్ -1 వాయిదాపై సుప్రీం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై గ్రూప్ -1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

563 పోస్టుల్ని భర్తీ చేసేందుకు.. గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల్లో జీఓ 29ను రద్దు చేయాలని, దాని వల్ల తమకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదని వాపోతున్నారు. మెరిట్ అభ్యర్థులకే రిజర్వేషన్లు ఇవ్వడంపై అభ్యర్థులతో పాటు విపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


Similar News