ప్రభుత్వ డాక్టర్లకు షాక్..? ప్రైవేట్ ప్రాక్టీస్ నో

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్ లో ప్రాక్టీస్​ చేసే వ్యవస్థను కూకటి వేళ్లతో

Update: 2022-04-08 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్ లో ప్రాక్టీస్​ చేసే వ్యవస్థను కూకటి వేళ్లతో తొలగించేందుకు సర్కార్​ ప్రయత్నాలు చేస్తున్నది. పీహెచ్​సీ, టీచింగ్​, తెలంగాణ వైద్య విధాన పరిషత్​లో పనిచేసే రెగ్యులర్​ డాక్టర్లకు ఆ వెసులుబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోబోతున్నది. ఈ మేరకు న్యూ రిక్రూట్​ మెంట్లలో కొత్త రూల్​ తీసుకురానున్నారు. ప్రస్తుతం డాక్టర్లకు ఉన్న సర్వీస్​ రూల్స్​ ను మార్చాలని కసరత్తులు చేస్తున్నది. దీనిపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఎక్స్​పర్ట్స్​ నుంచి ప్రభుత్వం సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్​ వద్దకు కూడా ఈ ప్రపోజల్ చేరుకున్నది. అక్కడి నుంచి గ్రీన్​సిగ్నల్​ రాగానే ఈ విధానం అమలు చేస్తూ ఆరోగ్యశాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. త్వరలో రాబోతున్న కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం లేకుండా గైడ్​లైన్స్​ తయారు చేయనున్నారు. డ్యూటీ తర్వాత కూడా ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలు లేకుండా ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలకు అనుకూలంగా ఉన్న వారికే రిక్రూట్​ మెంట్లలో అవకాశం ఇవ్వాలని సర్కార్​ భావిస్తున్నది. త్వరలో భర్తీ చేయనున్న డాక్టర్ల పోస్టులన్నీ ఇదే విధానంలో జరగనున్నట్లు వైద్యారోగ్యశాఖలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్​ప్రాక్టీస్​ లు వదలుకున్నోళ్లకు ఇన్సెంటీవ్స్​ కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అల్టిమెట్​గా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నదని ప్రభుత్వ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పుడేం జరుగుతున్నది...? ప్రభుత్వం చేసే ప్లాన్..

ప్రస్తుతం మెజార్టీ ప్రభుత్వాసుపత్రుల్లో జీతం తీసుకుంటూ, కొందరు డాక్టర్లు ప్రైవేట్​లో సేవలు అందిస్తున్నారు. ఓపీ చూడటమే కాకుండా ఆపరేషన్లు కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్​ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్​ ఆసుపత్రుల లో పనిచేస్తూ ప్రైవేట్​ క్లినిక్​లు నడుపుతున్న డాక్టర్లపై నిఘా పెట్టి చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతీ ఆసుపత్రిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వీటి లింక్​ ను మంత్రి హరీష్​రావు, హెల్త్​ డైరెక్టర్​, డీఎంఈ, ఫ్యామిలీ వేల్ఫేర్​ కమిషనర్​లకు ఇవ్వనున్నారు. దీని వలన డ్యూటీ సమయాల్లో ఆసుపత్రులకు ఆలస్యంగా వస్తున్న వారిని గుర్తించడం సులువుగా ఉండనున్నది.

ఓపీ తర్వాత 50 శాతం డుమ్మా......

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంజీఎం, కోఠి మెటర్నిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లలో ఓపీ తర్వాత 50 శాతం మంది డుమ్మా కొడుతున్నారు. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి సొంత క్లినిక్​లు నడుపుతున్నారు. ఇక టీచింగ్​ ఆసుపత్రుల్లోనైతే మద్యాహ్నం 2 తర్వాత వచ్చే వాళ్లు కూడా ఉన్నారని స్వయంగా ఉస్మానియా, గాంధీ అడ్మినిస్ట్రేటివ్​ అధికారులే అఫ్​ది కార్డులో చెబుతున్నారు. తాము ఎన్ని సార్లు చెప్పినా, తీరు మార్చుకోవడం లేదని ఆ అధికారులు అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు కావడంతో అడ్మినిస్ట్రేటీవ్​ ఆఫీసర్లు కూడా వారిపై ఒత్తిడి తేలేకపోవడం గమనార్హం. దీంతో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందడం లేదు.

Tags:    

Similar News