విడాకుల భరణానికి మతంతో సంబంధం లేదు.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

భార్య భరణానికి సంబంధించిన వ్యవహారం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది.

Update: 2024-07-10 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్: భార్య భరణానికి సంబంధించిన వ్యవహారం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. అధికారికంగా విడాకులు తీసుకున్న భార్యకు చట్టబద్ధమైన హక్కుతో వచ్చే భరణంకు అనుకూలంగా వ్యవహరించే సెక్షన్ 125 CrPC, మహిళలందరికీ వర్తిస్తుందని కోర్టు తెలిపింది. మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెయింటెనెన్స్ అనేది దాతృత్వం కాదని, వివాహిత మహిళల హక్కు అని, ఇది అందరికీ వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ ఆర్డర్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

విడాకుల భరణం అంటే ఏమిటి?

ఒక భార్య కుటుంబ ఇంటి నుండి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, ఆమె భర్త ఆమెకు భరణం చెల్లించాలి. ఒకవేల భార్యాభర్తల వైవాహిక కేసు పెండింగ్‌లో ఉంటే స్వల్పకాలంలో భరణం అందించబడవచ్చు. భార్యకు ఎంత చెల్లించాలో నిర్ణయించే అధికారం కోర్టుకు ఉంది. కోర్టు విభజనను ఆదేశించిన తర్వాత భరణం పర్మినెంట్ చేయబడుతుంది.


Similar News