Rangarajan: హిందూ ఆలయాలపై దాడులు చేసే వారిని ఉరి తీయాలి : రంగరాజన్ సంచలన వ్యాఖ్యలు

ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలపై దాడులు చేసే వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదని, బాధ్యులను వెంటనే ఉరి తీయాలని చిలుకూరు బాలాజీ (Chilukuru Balaji) ఆయన ప్రధాన అర్చకులు రంగరాజన్ (Rangarajan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-23 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలపై దాడులు చేసే వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదని, బాధ్యులను వెంటనే ఉరి తీయాలని చిలుకూరు బాలాజీ (Chilukuru Balaji) ఆయన ప్రధాన అర్చకులు రంగరాజన్ (Rangarajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌ (Secunderabad)లో దుండగుడు దాడి చేసిన ముత్యాలమ్మ ఆలయాన్ని (Mutyalamma Temple) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో శాంతి పూజ కూడా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం (Constitution of India) రామరాజ్యంతో సమానమని తెలిపారు. కానీ, రాజ్యాంగంలోని సారాంశం నేడు రాష్ట్రంలో మచ్చుకైనా కనిపించడం లేదని తెలిపారు.

హిందువులు (Hindus) అమ్మ వారి విగ్రహాన్ని దేవత రూపంతో కొలుస్తుంటే.. ఇతరులు అదే విగ్రహాన్ని రాయితో పోల్చడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి భయం, భక్తి కలిగించాలంటే చట్టాలు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాధ్యులపై పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న యావజ్జీవ కారాగార శిక్ష (Life Imprisonment)ను ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన, ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని ఉరి తీయాలని కామెంట్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తేనే.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా ఉంటాయని రంగరాజన్ (Rangarajan) స్పష్టం చేశారు.


Similar News