తిరుమల దర్శనాలపై తెలంగాణ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు

తిరుమల దర్శనా(Tirumala darshan)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-10-23 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల దర్శనా(Tirumala darshan)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి మన ఆస్తులు కావాలి.. కానీ తిరుమలలో మనకు హక్కు లేదంట’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు తిరుమల ఆలయం తమిళనాడు ఆధీనంలో ఉండేదని గుర్తుచేశారు. పునర్విభజనలో భాగంగా తెలుగు మాట్లాడేవారి కోసం ఉమ్మడి రాష్ట్రానికి తిరుమలను కేటాయించారని అన్నారు. తిరుమలలో తమ ఎమ్మెల్యేల సిఫార్లు లేఖలను అనుమతించే వరకు ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.


ఆస్తులు, వ్యాపారాల కోసం ఏపీ వాళ్లు తెలంగాణకు వస్తారు. కానీ, తమకు తిరుమలలో ప్రొటోకాల్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరమే లేదు. దీనిపై ఎంతదూరమైనా వెళ్లి కొట్లాడుతామని అన్నారు. అనంతరం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు తిరుమలలో ఎందుకు ప్రొటోకాల్ ఇవ్వరో చెప్పాలని డిమాండ్ చేశారు. అనిరుధ్ రెడ్డికి తామంతా మద్దతుగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమ మాట వినేలా ఒత్తిడి తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..