సామాన్యులకు హడల్.. సెంచరీ కొట్టిన టమాటా ధర

వర్షాకాలం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా కూరగాయల ధరలను చూస్తేనే ప్రజలు హడలెత్తి పోతున్నారు.

Update: 2024-10-07 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా కూరగాయల ధరలను చూస్తేనే ప్రజలు హడలెత్తి పోతున్నారు. ఈ క్రమంలోనే సమాన్యుల ఇండ్లలో నిత్యం ఉండే టమాటా ఏకంగా సెంచరీ దాటి.. దానిని కొనాలంటే భయపడేలా చేసింది. గత కొద్ది రోజులుగా కేజీ టమాటా రూ. 60 ఉండగా.. సోమవారం అమాంతం పెరిగి 100 కి చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్ లో కేజీ టమాటా ధర రూ. 80-90 కి అమ్ముతున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో టమాటా కేజీ ధర 100 దాటిపోయింది. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వలన ధరలు అమాంతం పెరిగి పోయినట్లు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టామాటా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టామాటాతో పాటుగా.. ఉల్లిగడ్డ కూడా దాదాపు వందకు చేరువలో ఉంది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ లో కేజీ రూ. 60 కి అమ్ముతున్నట్లు తెలుస్తుంది. అలాగే బెండకాయ రిటైల్ లో కేజీ రూ. 70, బీన్స్ 100, దొండకాయ 60, క్యాప్సికం 80 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో ఎమ్ కొనాలో.. ఎమ్ తినాలో తెలియక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Similar News