KCR నేమ్ బోర్డుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు

జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కలిగిన బోర్డుపై మట్టి పూసిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు.

Update: 2023-12-09 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కలిగిన బోర్డుపై మట్టి పూసిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పని చేసిన కాంగ్రెస్ యూత్ లీడర్ రాకేష్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ప్రజాభవన్ లో తొలిసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా భవన్ బిల్డింగ్‌ను ప్రారంభోత్సవం నాటి శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఉన్న చోట రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మట్టి పూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చర్యను పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధ్యుడి‌పై కేసు బుక్ చేశారు.


Similar News