Sajjanar : క్యూనెట్ సంస్థకు దేశ బహిష్కరణ..ఎన్సీఎల్టీ తీర్పుపై సజ్జనార్ ట్వీట్

సైబర్ నేరాలు..ఆన్ లైన్ గొలుసుకట్టు ఆర్థిక మోసాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా మోస‌పూరిత క్యూనెట్(QNet) సంస్థపై ఇటీవ‌ల నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిట్యున‌ల్-బెంగ‌ళూరు(NCLT Bengaluru) ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు(Landmark Judgement)ను ట్వీట్ చేశారు.

Update: 2024-12-27 09:08 GMT

V.C. Sajjanar : సైబర్ నేరాలు..ఆన్ లైన్ గొలుసుకట్టు ఆర్థిక మోసాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా మోస‌పూరిత క్యూనెట్(QNet) సంస్థపై ఇటీవ‌ల నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిట్యున‌ల్-బెంగ‌ళూరు(NCLT Bengaluru) ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు(Landmark Judgement)ను ట్వీట్ చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ(క్యూనెట్‌)ను తన వ్యాపారాన్ని భార‌త‌దేశంలో చేయవద్ధని, త‌క్షణ‌మే ఇండియా నుంచి వెళ్లిపోవాల‌ని(Move Out of the India) ఎన్సీఎల్టీ ఆదేశించిందని వెల్లడించారు.

క్యూనెట్ అని విస్తృతంగా పిలవబడే ఈ కంపెనీ.. మోసపూరిత స్కీమ్‌ల ద్వారా మిలియన్ల మంది ప్రజలను మోస‌గించిందని, ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా వేలాది కేసులను ఎదుర్కొంటోందని సజ్జనార్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి ఈ మోస‌పూరిత క్యూనెట్ స్కామ్ గురించి తెలియజేయండని, దాని బారిన పడకుండా దూరంగా ఉండండని సజ్జనార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News