బ్రేకింగ్ : రంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బీభత్సం

అంబర్ పేట్ బాలుడిపై వీధి కుక్కల దాడి మరవక ముందే ఈ రోజు ఉదయం రెండు ఘటనలు చోటు చేసుకోవడం కలవర పెట్టింది.

Update: 2023-02-22 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంబర్ పేట్ బాలుడిపై వీధి కుక్కల దాడి మరవక ముందే ఈ రోజు ఉదయం రెండు ఘటనలు చోటు చేసుకోవడం కలవర పెట్టింది. కాగా తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కలు ఐదుగురిపై దాడి చేశాయి. వీరిలో ఓ బాలుడి చేయి, తలపై వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి.

వరుస ఘటనలతో హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. చైతన్యపురిలో చిన్నారిపై, కరీంనగర్ లో సుమంత్ అనే విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. నిన్న వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోగా వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.

Tags:    

Similar News