పారా మెడికల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
పార మెడికల్ కోర్సు అడ్మిషన్ల గడువును పెంచారు. అర్హులంతా ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
దిశ; తెలంగాణ బ్యూరో: పార మెడికల్ కోర్సు అడ్మిషన్ల గడువును పెంచారు. అర్హులంతా ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 25 నుంచి కౌన్సిలింగ్ మొదలు కానుందని, 30న తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్ధులు డిసెంబరు 2లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబరు 21న నోటిఫికేషన్ రాగా, నవంబరు 11 వరకు దరఖాస్తుకు సమయం ఇచ్చారు. విద్యార్ధుల వినతి మేరకు తేదీని పొడిగించామని అధికారులు వెల్లడించారు.