CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రజాపాలన విజయోత్సవాల(public governance celebrations)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-11-14 16:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాపాలన విజయోత్సవాల(public governance celebrations)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. ఈ ఏడాది పాలనా కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించ తలపెట్టింది. ఈ విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న వరంగల్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరామహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో విజయోత్సవ ముగింపు సభలు జరపనున్నారు. 7వ తేదీన ట్యాంక్ బండ్ మీద, 8న సచివాలయంలో, 9న నెక్లెస్ రోడ్ వేదికగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాగా చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవాలపై సీఎం గురువారం ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News