TS High Court : భూదాన్ భూముల వ్యవహారం.. అధికారులపై హైకోర్ట్ సీరియస్

భూదాన్ భూముల(Bhoodan Lands) వ్యవహారంలో అధికారులపై హైకోర్ట్(High Court) సీరియస్ అయింది.

Update: 2024-11-14 17:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : భూదాన్ భూముల(Bhoodan Lands) వ్యవహారంలో అధికారులపై హైకోర్ట్(High Court) సీరియస్ అయింది. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం ఇవ్వడంపై తెలంగాణ హైకోర్ట్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూముల వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంటే.. పట్టా పాస్ బుక్ ఎలా జారీ చేస్తారని ధర్మాసనం మండిపడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో 10.29 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ కార్యదర్శికి, భూదాన్ బోర్డుకు, అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్ట్ ఈనెల 28కి వాయిదా వేసింది.   


Similar News