ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లకు కృషి: ప్రొఫెసర్ గాలి వినోద్​కుమార్​

ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నం చేయాలని లండన్​గ్లోబల్ అంబేద్కర్​రైట్స్​ కన్వెన్షన్​ తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిర్మూలనకు కృషి చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ మేరకు న్యాయవాదుల సహకారాన్ని తీసుకోవాలని ప్లాన్ చేశారు.

Update: 2022-10-16 13:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నం చేయాలని లండన్​గ్లోబల్ అంబేద్కర్​రైట్స్​ కన్వెన్షన్​ తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిర్మూలనకు కృషి చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ మేరకు న్యాయవాదుల సహకారాన్ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. లండన్‌లో ఈ నెల 13 నుంచి15 వరకు జరిగిన ' గ్లోబల్ అంబేద్కరైట్స్ కన్వెన్షన్ 2022' సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఆర్థిక వృద్ధిపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫండ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రైవేట్ రంగంలో అపర్మేటివ్ యాక్షన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు రిజర్వేషన్లు అమలుకు రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిందిగా తీర్మానించామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్​కోసం ప్రత్యేక నిధులు జమ చేస్తామన్నారు. బహుజన బ్యాంకును ఏర్పాటు చేస్తూ, ప్రతి గ్రామంలో దళిత కో ఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు స్పష్టం చేశారు. ఇక మహిళా ఎంపవర్‌మెంట్ సెల్, ఐటీ సెల్‌కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో దళితులకు అవగాహన కల్పించి దిశా నిర్ధేశం చేస్తామన్నారు.

Tags:    

Similar News