నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీ గండి

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తోడవ్వడంతో వరద భారీగా పెరిగింది.

Update: 2024-09-01 08:38 GMT

దిశ, నడిగూడెం: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తోడవ్వడంతో వరద భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు ఏడు లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ క్రమంలో వచ్చిన నీటిని వచ్చినట్లే సాగర్ జలాశయం నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ నాని పోవడంతో భారీగా గండి పడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాల్వకు భారీ గండి పడి అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం కాల్వకు రెండు చోట్ల 20 మీటర్ల మేరకు గండి పడినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.


Similar News