Raj Pakala: రెండ్రోజులు టైమ్ ఇవ్వండి.. మోకిలా పోలీసులకు కేటీఆర్ బామ్మర్ది రిక్వెస్ట్
మోకిలా పోలీసులకు కేటీఆర్ బామ్మర్ది రిక్వెస్ట్ చేసుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ ఫామ్ హౌస్‌లో కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల (Raj Pakala)కు మోకిలా పోలీసులు (Mokila Police) ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. విచారణకు హాజరయ్యేందుకు రెండ్రోజుల గడువు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన తన లాయర్ల ద్వారా తన లేఖను పోలీసులకు పంపించారు. మరో వైపు పోలీసులు తనని అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో హైకోర్టు (Tg High Court) లో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతున్నది.