Telangana Intelligence: సీఎం రేవంత్ సెక్యూరిటీలో కీలక మార్పులు

బెటాలియన్‌ పోలీసుల(Battalion Police) ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) అప్రమత్తమైంది.

Update: 2024-10-28 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెటాలియన్‌ పోలీసుల(Battalion Police) ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసం వద్ద భద్రత సిబ్బందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్(CM Security Wing) మార్చింది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు(Armed Reserve Police)లను నియమించారు. ఈ మార్పులను సోమవారం నుంచే అమలు చేశారు.

కాగా, గతకొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇప్పటికే సెలవుల విషయంలో వెనక్కి తగ్గినట్లు పోలీస్ శాఖ(Police Department) ప్రకటన విడుదల చేసినా ఆందోళనలు ఆగడం లేదు. దీంతో సీఎ రేవంత్ ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ పోలీసులను మారుస్తూ డిపార్ట్‌మెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News