BRS: ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి..? బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన ట్వీట్
వాంకిడి(Wankidi)కి ప్రజాప్రతినిధులను(Public Representatives) అడ్డుకోవడం సిగ్గుచేటని, ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ప్రశ్నించారు.
దిశ, వెబ్ డెస్క్: వాంకిడి(Wankidi)కి ప్రజాప్రతినిధులను(Public Representatives) అడ్డుకోవడం సిగ్గుచేటని, ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ప్రశ్నించారు. వాంకిడిలో ఫుడ్ పాయిజన్(Wankidi Food Poison) వల్ల చనిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించేందు వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(BRS MLA Kova Lakshmi) సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం(Block) సిగ్గుచేటని మండిపడ్డారు.
తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియా(Media)ను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బ్యారైకెడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదని వ్యాఖ్యానించారు. ఇక జాతీయ రాజ్యాంగ దినోత్సవం(National Constitution Day) అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress Government) అడుగడుగునా తుంగలో తొక్కుతున్నదని విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు.. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి..? అని హరీష్ వారు నిలదీశారు.