Minister Komatireddy: సీఎంతో సమీక్ష నాటికి కచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి

జాతీయ రహదారుల భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సీరియస్ అయ్యారు.

Update: 2024-11-26 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రహదారుల భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సీరియస్ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్నా మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మనం ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నాం.. కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదని అన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్ క్లోజ్ చేయాలని సూచించారు.

పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తా.. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘కట్టే విరగదు – పాము చావదు’ అన్నట్టు వ్యవహరిస్తే ఇంకా పదేండ్లయిన ఒక్క రోడ్డు వేయలేం అని అన్నారు. కలెక్టర్లతో కలిసి వేగంగా భూసేకరణ చేయాలని ఆదేశించారు. పంటల సీజన్ మొదలైతే భూసేకరణ అసాధ్యమని అన్నారు. ఖమ్మం జిల్లాలో 400 అర్బిట్రేషన్ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని అడిగారు. అవార్డు ప్రకటించినా.. పనులు చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష నిర్వహించే నాటికి పనుల్లో కచ్చితంగా పురోగతి ఉండాలని ఆదేశించారు.

Tags:    

Similar News