Harish Rao: బాడీ షేమింగ్‌పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటనపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-28 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటనపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు(Harish Rao) మీడియాతో మాట్లాడారు. ఫామ్‌హౌజ్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘అది ఫామ్‌హౌజ్ కాదు.. రాజ్ పాకాల(Raj Pakala) కొత్త ఇల్లు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీ(Rave party) అని అసత్య ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ(Rave party)లో పిల్లలు, వృద్ధులు ఉంటారా?’ అని హరీష్ రావు ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కేటీఆర్‌(KTR)పై బురద జల్లుతున్నారని విమర్శించారు. మూసీ(Musi) విషయంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్న కారణంగానే కేటీఆర్‌(KTR)ను టార్గెట్ చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని విమర్శించారు. ‘వివిధ వర్గాల నుంచి వస్తోన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి వణికిపోతున్నారు.

బండి సంజయ్(Bandi Sanjay) తన స్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తానా అంటే.. బండి సంజయ్(Bandi Sanjay) తందానా అంటున్నారు. బాధ్యత కలిగిన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి తరుపున బండి సంజయ్ వకాల్తా పుచ్చుకున్నారని హరీష్ రావు విమర్శించారు. బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు.. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషమే తప్పా.. విజన్ లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదు.

ఫామ్‌హౌజ్ ఫంక్షన్‌లో కేటీఆర్(KTR) సతీమణి లేరని స్పష్టం చేశారు. అసలు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళనలు చేస్తున్నాయి. స్వయంగా పోలీసులే రోడ్లమీదకు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం చరిత్రలో తొలిసారి అని అన్నారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు సీఎం రేవంత్ తనను బాడీ షేమింగ్(body shaming) చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పాలన చేతకాదని.. నోటికి వచ్చినట్లు తిట్టడమే సాధ్యమవుతుందని అన్నారు.

Tags:    

Similar News