ప్రజా భవన్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కీలక భేటీ స్టార్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో అడుగుపెట్టారు. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో అడుగుపెట్టారు. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించేందుకు ముఖాముఖీ భేటీ కావాలని ఏపీ, తెలంగాణ సీఎంలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ మంత్రులు, అధికారుల బృందంతో కలిసి చంద్రబాబు ప్రజా భవన్‌కు వచ్చారు. అనంతరం, గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ షెడ్యూల్ ప్రకారం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యింది. ఈ భేటీకి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొనగా.. ఏపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పయ్యవుల, అనగాని, జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, మరికొందరు ఆఫీసర్లు హాజరయ్యారు. సీఎంల హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుల తొలిసారి మీట్ కావడంతో తెలంగాణతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ ఈ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.