బ్రేకింగ్: TSPSC పేపర్ల లీక్ కేసు నిందితురాలు రేణుకకు షాకిచ్చిన కోర్టు

Update: 2023-04-01 15:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కీలక నిందితురాలు అయిన రేణుకకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో రేణుక దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కాగా, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రేణుకకు బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అలాగే ఇదే కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్‌లను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. అయితే, ఈ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News