BRS: రాహుల్ గాంధీ ఇది సేఫ్ ఎలా అవుతుంది..? మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్
కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు రెండు ప్రజాస్వామ్యానికి మంచివి కావని(Not Good For Democracy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు రెండు ప్రజాస్వామ్యానికి మంచివి కావని(Not Good For Democracy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. మిస్టర్ రాహుల్ గాంధీ!, మీ ద్వంద్వ భావజాలం కలవరపెడుతోందని, దయచేసి స్పష్టత ఇవ్వండి అని వ్యంగ్యస్థ్రాలు సంధించారు.
అలాగే మోడీ(PM MOdi), అదానీ(Adani) కలిస్తే స్కామ్(Scam) అయితే? రేవంత్(CM Revanth Reddy), అదానీ కలిస్తే అంతా సేఫ్(Safe) ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంతేగాక ధారావి(Dharavi)కి లక్ష కోట్లు వెచ్చిస్తున్నప్పుడు అది కుంభకోణం అయితే? మూసీ(Moosi) ప్రాజెక్ట్‌లో లక్షా యాభై వేల కోట్లు ఉన్నప్పుడు అన్నీ సేఫ్ ఎలా అవుతుందని నిలదీశారు. మీ సేఫ్.. బీజేపీ సేఫ్ కి ఎలా భిన్నంగా ఉంటుందని, రాష్ట్రం నుండి రాష్ట్రానికి మరియు ఎన్నికల నుండి ఎన్నికలకు మారుతుందా అని అడిగారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజాస్వామ్యానికి గానీ, అభివృద్ధికి గానీ సురక్షితం కాదని కేటీఆర్ ఆరోపించారు.