Komatireddy: తప్పకుండా అది గేమ్ చేంజర్ అవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ రహదారి(Elevated Highway) పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు.

Update: 2024-11-18 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ రహదారి(Elevated Highway) పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉప్పల్ - మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు మరో ఏడాదిన్నరలో పూర్తవుతాయని అన్నారు. గత ఏడేళ్లలో ఉప్పల్ గుంతల్లో పడి ఎంతోమంది పనిపోయారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్(RRR) ప్రాజెక్టు పనులను 2016 నుంచి పెండింగ్‌లో పెట్టిందని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ఇచ్చే నిధులపై కేంద్రం స్పష్టత కోరితే ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు.

ఓఆర్ఆర్(ORR) వల్లే ట్రిపులార్ కూడా హైదరాబాద్‌కు, తెలంగాణకు గేమ్ చేంజర్(Game Changer) అవుతుందని కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం(Srisailam) క్షేత్రానికి రూ.7 వేల కోట్ల ప్రాజెక్టును సాధించనున్నాం, శ్రీశైలానికి రిజర్వ్ ఫారెస్ట్ గుండా 62 కిలోమీటర్ల మేర సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు సాకారం అవుతుందని తెలిపారు. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాత ఒప్పందం రద్దుకు జీఎంఆర్ సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఆరు లైన్ల రహదారి పనులు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..