HYDRA : హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేసిన దీప్తి శ్రీ నగర్ వాసులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissionar Ranganath) సోమవారం నగరంలోని పలు చెరువులను పరిశీలించారు.

Update: 2024-11-18 11:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissionar Ranganath) సోమవారం నగరంలోని పలు చెరువులను పరిశీలించారు. చందానగర్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంటలోని చెరువులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. స్థానిక అపర్ణ హిల్స్ లోని మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా మళ్లించిన విధానంను రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. దీప్తిశ్రీ నగర్లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి, స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజా అవసరాలకు ప్రభుత్వం కేటాయించిన 5 వేల గజాల స్థలన్నీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని దీప్తిశ్రీ నగర్ వాసులు రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. చెరువులతోపాటు పార్కుల స్థలాలను కూడా రక్షించాలని రంగనాథ్ ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్.. అధికారులతో వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువులు, కుంటాల స్థలాలను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని, చెరువుల పరిరక్షణకు స్థానికులు కూడా ముందుండాలని రంగనాథ్ పిలిపునిచ్చారు.   

Tags:    

Similar News