తెలంగాణకు కేంద్రం శుభవార్త.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ(IIHT)ని మంజూరు చేస్తూ శనివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-03-02 16:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ(IIHT)ని మంజూరు చేస్తూ శనివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. IIHT తో జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విద్యార్థులకు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే, దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

అయితే, యువత చేనేత సాంకేతిక కోర్సుల వైపు చూస్తుండగా.. రాష్ట్రంలో కోర్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (IIHT)కి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్‌టీని పరిగణిస్తుండగా.. ఇందులో కోర్సులకు మంచి డిమాండ్‌ ఉన్నది. ఈ క్రమంలో భూదాన్‌ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక IIHT ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికగా మారింది.

Tags:    

Similar News